News July 6, 2024

13న సోమశిలకు ముగ్గురు మంత్రులు

image

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని 13వ తేదీన ముగ్గురు మంత్రులు సందర్శించనున్నారు. నెల్లూరులోని సంతపేటలో గల ఆనం నివాసంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రులు ఆనం, నారాయణ విచ్చేయనున్నారు. ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న ప్రాంతాలను, సోమేశ్వర ఆలయాన్ని సందర్శిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Similar News

News October 20, 2025

భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్

image

జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయని, ఇంకా కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో సూచించారు. తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ, వెళ్లినా వెంటనే వచ్చేయాలని సూచించారు.

News October 19, 2025

నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

image

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

News October 19, 2025

నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

image

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్‌పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్‌ను విచారణకు పంపనున్నారు.