News September 12, 2025

13న నూతన కలెక్టర్ బాధ్యతల‌ స్వీకరణ

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కీర్తి చేకూరి సెప్టెంబర్ 13న మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2016 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆమె గతంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ జిల్లాలో గతంలో జాయింట్ కలెక్టర్‌గా కూడా ఆమె పనిచేశారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

Similar News

News September 12, 2025

బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై కేసు పెట్టాం: కొవ్వూరు సీఐ

image

కొవ్వూరులో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన దాసరి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాలికను యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎస్సీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News September 12, 2025

తూ.గో: 91 మందిపై కేసులు నమోదు

image

ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళ్లల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 577 వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 91 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటు 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 171 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

News September 12, 2025

విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి

image

లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం సాయంత్రం ఆయన జైలులో లొంగిపోయారు. రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ చేపట్టనున్నారు.