News September 10, 2024
13-04-2029: భూమికి అత్యంత సమీపానికి భారీ గ్రహశకలం

అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తోన్న ఓ భారీ గ్రహశకలాన్ని ఇస్రో పర్యవేక్షిస్తోంది. దీనిని ఈజిప్ట్ దేవుడు ‘అపోపిస్’ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు. 2029 ఏప్రిల్ 13న భూమికి కేవలం 32,000 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రహశకలం 340-450 మీటర్ల వ్యాసం ఉంటుందని తెలిపారు. 300 మీటర్ల కంటే పెద్దదైన గ్రహశకలం ఢీకొడితే ఓ ఖండం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Similar News
News November 19, 2025
రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
News November 19, 2025
హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.
News November 19, 2025
ఇండియా-ఎ ఓటమి

సౌతాఫ్రికా-ఎతో జరిగిన 3వ అనధికారిక వన్డేలో భారత్-ఎ 73 రన్స్ తేడాతో ఓడిపోయింది. SA నిర్దేశించిన 326 రన్స్ టార్గెట్ను ఛేదించలేక 252 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఆయుష్ బదోని(66), ఇషాన్ కిషన్(53) మినహా ఎవరూ రాణించలేదు. రుతురాజ్ 25, అభిషేక్ 11, తిలక్ వర్మ 11, పరాగ్ 17 రన్స్కే ఔటై నిరాశపరిచారు. అంతకుమందు SA ఓపెనర్లు ప్రిటోరియస్(123), మూన్సమీ(107) సెంచరీలతో చెలరేగారు.


