News August 3, 2024
20 రోజుల్లో 13 మంది పిల్లలు మృతి

ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆశాకిరణ్ వసతి గృహంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లోనే 13 మంది దివ్యాంగ పిల్లలు చనిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి 27 మంది మరణించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి అతిశీ స్పందించారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన షాకింగ్గా ఉంది. ఇది తీవ్రమైన సమస్య. ఈ అంశంపై విచారణ చేపట్టి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 3, 2026
గంజాయిని పెంచిపోషిస్తోంది కూటమి నేతలే: YCP

AP: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు HYDలో <<18752425>>గంజాయి<<>> తీసుకుంటూ దొరకడంపై వైసీపీ స్పందించింది. ‘సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డీ-అడిక్షన్ సెంటర్కు పంపారు. అప్పుడే కేసు రాజీ కోసం ఏపీ నుంచి కూటమి నేతలు రంగంలోకి దిగారు. హోంమంత్రి అనిత తెగ నీతులు చెప్పారు కదా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా గంజాయిని పెంచి పోషిస్తోంది మీ కూటమి నేతలేనని?’ అంటూ ప్రశ్నించింది.
News January 3, 2026
IIIDMలో నాన్ టీచింగ్ పోస్టులు

IIIT డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కర్నూలు 16 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/B.Tech/MSc/MCA, ME/MTech, MBA, BSc నర్సింగ్, B.PEd, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iiitk.ac.in
News January 3, 2026
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్

TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలకమైన నీటి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంటే సభ్యులు లాబీలో తిరగడంపై సీరియస్ అయ్యారు. సభలో ఎవరూ లేకపోవడంతో వారిని వెంటనే లోపలికి పిలిపించాలంటూ విప్లను ఆదేశించారు.


