News July 29, 2024
ఢిల్లీలో 13 సివిల్స్ కోచింగ్ సెంటర్లకు సీల్
ఢిల్లీలోని రావూస్ IAS స్టడీ సర్కిల్లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో డిల్లీ మున్సిపాలిటీ చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 13 కోచింగ్ సెంటర్లను మూసివేశారు. ఇటు రావూస్ కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్లకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పార్కింగ్, సరుకు నిల్వ పేరుతో అనుమతి తీసుకుని అక్రమంగా లైబ్రరీ నడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News January 9, 2025
Rs.3961CR బకాయిలు: TGపై గ్లోబల్ లిక్కర్ కంపెనీల ఒత్తిడి
బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వంపై గ్లోబల్ ఆల్కహాల్ కంపెనీలు ఒత్తిడి తెస్తునట్టు తెలిసింది. డియాజియో, పెర్నాడ్ రికార్డ్, కాల్స్బర్గ్ వంటి కంపెనీలకు ప్రభుత్వం $466m (Rs.3961CR) బాకీ పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా Heineken ఈ వారం ఆల్కహాల్ సరఫరాను సస్పెండ్ చేసినట్టు సమాచారం. రూ.900 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ఫిషర్ బీర్లు ఉత్పత్తి చేసే UBL సరఫరాను బంద్ చేయడం తెలిసిందే.
News January 9, 2025
రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News January 9, 2025
INDIA కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమే: కాంగ్రెస్
ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటైంది తప్ప, అసెంబ్లీ ఎన్నికలకు ఉద్దేశించినది కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో INDIA మిత్రపక్షాలు ఆప్నకు మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ను పట్టించుకోకపోవడంతో కూటమి కుదేలైనట్టే అనే విమర్శలు వినిపించాయి. ఢిల్లీలో పార్టీకి ఏళ్లుగా ఉన్న పట్టు వల్ల ఒంటరిగా బరిలో దిగాలని కోరుకుంటున్నట్టు INC పేర్కొంది.