News August 23, 2025

SA టీ20 లీగ్‌కు 13 మంది భారత ఆటగాళ్లు

image

వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న SA టీ20 లీగ్‌లో 13 మంది భారత ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. పీయూష్ చావ్లా, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, వెంకటేశ్ గాలిపెల్లి, మహేశ్ అహిర్, సరుల్ కన్వర్, అనురీత్ సింగ్ కతూరియా, నిఖిల్ జగా, కేఎస్ నవీన్, ఇమ్రాన్ ఖాన్, అతుల్ యాదవ్, అన్సారీ మరూఫ్, మహమ్మద్ ఫైద్ వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పీయూష్ తప్ప, మిగతా వారందరి బేస్ ప్రైజ్ రూ.10 లక్షలుగా ఉంది.

Similar News

News August 23, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. వైట్ బ్రెడ్, ప్యాకేజ్డ్ జ్యూసులు, డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ తీసుకోవద్దని, వీటి వల్ల బరువు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. పూరీలు, మైసూర్ బోండాలు, పరోటాలు, పకోడీలకు బదులు ఇడ్లీ, ఉప్మా, తక్కువ ఆయిల్‌తో చేసిన దోశలు తినాలని సూచిస్తున్నారు.

News August 23, 2025

ఫలితాలు విడుదల.. టాపర్లు వీరే

image

AP: DSC-2025 మెరిట్ లిస్టు PGT ప్రిన్సిపల్ జాబితాలో 75.5 స్కోరుతో చింతల గౌతమ్ టాపర్‌గా నిలిచారు. 73 స్కోరుతో జి.రాజశేఖర్ 2వ ర్యాంక్ సాధించారు. PGT ఇంగ్లిష్‌లో స్వరూప(87 స్కోరు), హిందీలో రమేశ్(93.5), సంస్కృతంలో భాను(94), తెలుగులో ధర్మారావు(85.5), బయాలజీలో శివకుమార్(81.5), గణితంలో విజయ్(78.5), ఫిజికల్ సైన్స్‌లో బాలకిశోర్(74.5), సోషల్‌లో నిరోష(85) టాపర్లుగా నిలిచారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 23, 2025

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. కేంద్రం క్లారిటీ

image

భారత్‌లో మళ్లీ<<17486073>> టిక్‌టాక్<<>> వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా కొనసాగుతోంది. దానిని అన్‌బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది. భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది.