News August 2, 2024
విదేశాల్లో 13 లక్షల మంది ఉన్నత విద్య

2024లో ఇప్పటి వరకు 108 దేశాల్లో 13.35 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి కీర్తివర్ధన్ వెల్లడించింది. అత్యధికంగా కెనడాలో 4.37 లక్షలు, USలో 3.37 లక్షలు, చైనాలో 8,580, ఉక్రెయిన్‌లో 2,150, ఇజ్రాయెల్‌లో 900, పాక్‌లో 14 మంది చదువుతున్నారని రాజ్యసభలో తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు భారత ఎంబసీల్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 18, 2025
2015 గ్రూప్-2 సెలక్షన్ లిస్ట్ రద్దు: హైకోర్టు

TG: 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై HC కీలక తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో గ్రూప్-2 OMR షీట్ ట్యాంపరింగ్‌కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను TGPSC ఉల్లంఘించిందని ఇవాళ తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. OMR షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని TGPSCని ఆదేశించింది.
News November 18, 2025
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింత

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్ను భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్

TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా విగ్రహం వద్ద మ.12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.


