News December 19, 2024

నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి

image

ముంబై తీరంలో జ‌రిగిన బోటు ప్ర‌మాదానికి నిర్ల‌క్ష్య‌మే ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ప్ర‌మాదానికి ముందు నీల్‌క‌మ‌ల్ ఫెర్రీలో స‌రిప‌డా లైఫ్ జాకెట్లు ఉన్నా సిబ్బందితోపాటు, ప‌ర్యాట‌కులు ఎవ‌రూ ధ‌రించలేదు. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌రైన నిఘా కూడా లేకపోవడం గమనార్హం. బోటు మునుగుతున్న సమయంలో రెస్క్యూ బృందాలు లైఫ్ జాకెట్ల‌తో రాక‌పోయివుంటే ఈ ఘ‌ట‌న అతిపెద్ద ట్రాజెడీగా మిగిలేద‌ని అధికారులు తెలిపారు.

Similar News

News September 18, 2025

రాయికల్‌లో ‘లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర’

image

లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా గురువారం రాయికల్ మండలంలోని ఒడ్డేలింగాపూర్ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలను తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ & రాజ్యాధికార సాధన కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల క్లాస్ రూములను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

News September 18, 2025

విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.

News September 18, 2025

APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

image

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ ట‌న్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మ‌రింత‌ వెసులుబాటు కలుగుతుందని వ్య‌వ‌సాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.