News June 19, 2024
నాటుసారా తాగి 13 మంది మృతి

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. రోజువారీ కూలీలు కరుణాపురంలో నాటుసారా కొనుగోలు చేసి తాగడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, దృష్టి లోపం, విరేచనాలు లాంటి లక్షణాలు బయటపడ్డాయి.
Similar News
News January 22, 2026
అవును.. ప్రేమలో ఉన్నా: ఫరియా అబ్దుల్లా

తాను ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అబ్బాయి హిందువా ముస్లిమా అని యాంకర్ అడగగా హిందువేనని బదులిచ్చారు. లవ్ వల్ల తన లైఫ్‌లో బ్యాలెన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాను, తన బాయ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్ కాదని, అతడు డాన్స్ బ్యాక్ గ్రౌండ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. తాను ర్యాప్, డాన్స్‌లో రాణించడానికి అతడి సపోర్టే కారణమని చెప్పారు.
News January 22, 2026
అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?: కిషన్ రెడ్డి

TG: గతంలో BRS, ఇప్పుడు INC పాలనలో సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కొందరు CBI దర్యాప్తు కోరుతున్నారు. కానీ రాష్ట్ర అంశాలను CBI దర్యాప్తు చేయకూడదని గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. కోల్ బ్లాక్స్ వేలం నిర్వహణకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
News January 22, 2026
WPL: ఓడితే ఇంటికే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో మ్యాచులు రసవత్తరంగా మారాయి. RCB(10 పాయింట్లు) మినహా MI, UP, DC, GG నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ జట్లన్నీ తమ తదుపరి మ్యాచులన్నీ తప్పక గెలవాలి. లేదంటే ఇంటిబాట పడతాయి. ఇవాళ యూపీ-గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ వేళ ఈ మ్యాచ్ ఇరుజట్లకూ చావో రేవో కానుంది.


