News October 13, 2025
రాష్ట్రంలో 13 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

APలో 13 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎల్లుండే (OCT 15)ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు APPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్(11), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్(1), అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (1)పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. AMVI పోస్టుకు అదనంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/
Similar News
News October 13, 2025
NIEPMDలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ (NIEPMD) 7 కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 23లోగా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి SSLC, డిప్లొమా , బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://niepmd.nic.in/
News October 13, 2025
మిథున రాశి చిహ్నానికి అర్థమేంటి?

రాశీచక్రంలో మూడోదైన మిథున రాశి చిహ్నానికి అర్థమేంటో కొందరికి తెలియదు. దీని గురించి పండితులు ఇలా చెబుతున్నారు.. ఈ చిహ్నం జంట రూపంలో ఉంటుంది. దీని మూలకం వాయువు. ఇది సంభాషణ, జ్ఞాన సముపార్జనను సూచిస్తుంది. ఈ రాశివారు మేధోపరమైన జిజ్ఞాసకు నిలయంగా ఉంటారు. ఈ చిహ్నం ఆత్మలోని ద్వంద్వ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. నిత్య నూతన ఆలోచనలను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. వీళ్లు భావవ్యక్తీకరణలో ముందుంటారు.
News October 13, 2025
యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని: ట్రంప్

యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరి అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘శాంతి కోసం కృషి చేసినందుకు నేనెప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే నా దౌత్యం లక్ష్యం. అంతేకానీ అవార్డుల కోసం కాదు. మిలియన్ల ప్రాణాలను కాపాడాను’ అని తెలిపారు. గాజా యుద్ధం కూడా ముగిసిందని, ఇది తాను పరిష్కరించిన 8వ వార్ అని పేర్కొన్నారు. అఫ్గాన్-పాక్ ఘర్షణల గురించి తెలిసిందని, దానిపైనా దృష్టి పెడతానన్నారు.