News June 6, 2024
అసెంబ్లీ, లోక్‌సభకు 13 మంది శ్రీనివాస్‌లు

AP: తాజా ఎన్నికల్లో శ్రీనివాస్ పేరుతో NDA కూటమిలో మొత్తం 13 మంది గెలిచారు. వీరిలో అసెంబ్లీకి 11 మంది, లోక్‌సభకు ఇద్దరు వెళ్లనున్నారు. టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, BJP నుంచి ఒకరు MLAలుగా ఎన్నికయ్యారు. బీజేపీ, జనసేన నుంచి ఒకరు చొప్పున MPలుగా గెలిచారు. 13 మందిలో కొందరి పేర్లు శ్రీనివాస్ కాగా, మరికొందరి పేర్లు శ్రీనివాసరావుగా ఉండటం గమనార్హం.
Similar News
News December 10, 2025
T20ల్లో భారత్‌కు అతిపెద్ద విజయాలు

* 168 పరుగులు vs NZ (కెప్టెన్: హార్దిక్)
* 150 పరుగులు vs ENG (కెప్టెన్: సూర్య)
* 143 పరుగులు vs IRE (కెప్టెన్: కోహ్లీ)
* 135 పరుగులు vs SA (కెప్టెన్: సూర్య)
* 133 పరుగులు vs BAN (కెప్టెన్: సూర్య)
* 106 పరుగులు vs SA (కెప్టెన్: సూర్య)
* 101 పరుగులు vs AFG (కెప్టెన్: రాహుల్)
* 101 పరుగులు vs SA(నిన్నటి మ్యాచ్)
News December 10, 2025
నాగార్జున సాగర్@70ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.
News December 10, 2025
బుమ్రా 100వ వికెట్‌పై SMలో చర్చ!

SAపై తొలి T20లో బ్రెవిస్ వికెట్ తీసిన బుమ్రా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వికెట్‌పై SMలో చర్చ నడుస్తోంది. బుమ్రా నో బాల్ వేశారని, థర్డ్ అంపైర్ కూడా సరైన నిర్ణయం ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నిర్ణయం బౌలర్‌కు అనుకూలంగా ఉంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అది గుడ్ బాలా? నో బాలా? COMMENT.


