News April 28, 2024

నాగోల్-చాంద్రాయణగుట్ట రూట్‌లో 13 స్టేషన్లు

image

HYD నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే మెట్రో మార్గంలో 13 స్టేషన్లు రానున్నాయి. న్యూ నాగోల్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, LBనగర్, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రీనగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట, ఒవైసీ ఆస్పత్రి, DRDO, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్లు రానున్నాయి. నాగోల్‌లో ఇప్పుడున్న స్టేషన్ నుంచి కొత్తగా నిర్మించే రూట్‌లోని స్టేషన్‌ను కలిపేలా స్కైవాక్‌ను నిర్మిస్తారు.

Similar News

News September 16, 2025

OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.

News September 16, 2025

ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం ఆగ్రహం

image

TG: ఈ రోజు రాత్రి నుంచి <<17723721>>ఆరోగ్యశ్రీ సేవలను బంద్<<>> చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.75 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతినెలా బెదిరింపులు తంతుగా మారాయని, ఇక నుంచి అలా చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

News September 16, 2025

రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

image

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.