News April 29, 2024
1300-1400 ఎకరాల్లో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు..?

డోర్నకల్- గద్వాల రైలు మార్గాన్ని సర్వే సంస్థ గగనతల పద్ధతుల్లో గుర్తించింది. సూర్యాపేట- ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎస్సీపీ-104 నుంచి ప్రారంభించి డోర్నకల్ సమీపంలోని దుబ్బబంజర ప్రాంతంలో 118 వరకు మార్కింగ్ చేపట్టింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో సుమారు 1,300 నుంచి 1,400 ఎకరాల భూములు సేకరించనున్నట్లు సమాచారం.
Similar News
News January 10, 2026
విద్యుత్ లైన్లకు దూరంగా.. సంక్రాంతి జరుపుకోండి: ఎస్ఈ

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు. లోహపు పూత ఉండే చైనా మాంజా వాడటం వల్ల విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీగలకు పతంగులు చిక్కుకుంటే కర్రలతో తీయడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే 1912 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
News January 10, 2026
ఖమ్మం: ఆడబిడ్డలకు భరోసా.. ఉచితంగా క్యాన్సర్ టీకా

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 14-15 ఏళ్ల వయసున్న 19,500 మంది బాలికలను గుర్తించి, వారికి వచ్చే నెల నుంచి ఉచితంగా HPV వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తయింది. యుక్తవయసులోనే ఈ టీకా వేయడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 10, 2026
ఖమ్మం: పండగ పూట జాగ్రత్త.. సీపీ సునీల్ దత్ సూచనలు

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని తెలిపారు. దొంగతనాల నియంత్రణకు రాత్రి గస్తీ పెంచుతున్నట్లు వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లపై నిఘా ఉంచుతామని, ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.


