News March 16, 2024
వైసీపీ అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు

AP: వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 19 మంది మహిళలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు.
Similar News
News October 17, 2025
నేడు రామ ఏకాదశి.. ఏం చేయాలంటే?

ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి రోజున ‘రామ ఏకాదశి’ జరుపుకొంటారు. నేడు ఏకాదశి వ్రతం చేస్తే శుభం కలుగుతుందని స్కంద పురాణం పేర్కొంది. ‘ఈ శుభ దినాన లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తులసి ఎదుట దీపం వెలిగించి, దైవ ప్రార్థన చేయాలి. దానధర్మాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఉపవాసం శుభప్రదం. నారాయణ జపం, రామ ఏకాదశి కథ వినడం వల్ల పుణ్యం కలుగుతుంది’ అని పండితులు చెబుతున్నారు .
News October 17, 2025
నేటి నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ

TG: రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. 88 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం అందించనుంది. 32 జిల్లాల్లోని 46వేల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెంచేందుకు వీలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు రూ.123 కోట్లు ఖర్చు చేస్తోంది. మక్తల్లో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
News October 17, 2025
భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.