News August 23, 2024

13,226 గ్రామాల్లో ప్రత్యేక సభలు: చంద్రబాబు

image

రాష్ట్రలో ఉన్న 13,226 విలేజ్‌లలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సింపుల్ గవర్నమెంట్, సింపుల్ గవర్నెన్స్ విధానంలో పనిచేసే సాదా సీదా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వమని ఉద్గాటించారు. 2014-19 స్వర్ణ యుగం, 2019-24 చీకటి యుగం అన్నారు.

Similar News

News September 10, 2024

రాజమండ్రి: చిరుత పాదముద్రల గుర్తింపు

image

దివాన్ చెరువు ప్రాంతంలో సోమవారం చిరుత పులి పాదముద్రలను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి ఓ ప్రకటనలో తెలిపారు. చిరుత అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు ట్రాప్ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయన్నారు. చిరుత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దాన్ని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామని, చిరుత సంచారాన్ని బట్టి ట్రాప్ కెమెరాలను మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 9, 2024

రాజమండ్రి: ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాజమండ్రి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోసం గ్రామీణ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సెల్ ఫోన్ రిపేర్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెక్యూరిటీ కెమెరా ఏర్పాట్లు సర్వీస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 9, 2024

రాజమండ్రి: శాటిలైట్ సిటీలో పులి.. అంతా ఎడిటింగ్ (VIDEO)

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని శాటిలైట్ సిటీ గ్రామంలోని స్థానిక రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్స్ 11వ వీధిలో అర్ధరాత్రి చిరుత సంచరిస్తుందనే వార్త నిజం కాదని అటవీ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఫొటో ఎడిట్ చేశారని వివరించారు. ఆకతాయి పనులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.