News March 3, 2025
13,400 మంది విద్యార్థులకు.. ఉ.9 నుంచి పరీక్ష

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. నంద్యాల జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 13,400 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students
Similar News
News November 23, 2025
భూపాలపల్లి: రూ.50 కోట్ల ధాన్యం రికవరీలో నిర్లక్ష్యం!

జిల్లా సివిల్ సప్లై శాఖలో రూ. 50 కోట్ల విలువైన ధాన్యాన్ని నేటికీ రికవరీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. 2022-23 రబీ సీజన్‌లో జిల్లాలోని వివిధ రైస్ మిల్లర్ యజమానులు టెండర్ ద్వారా తీసుకున్న ఈ ధాన్యాన్ని, రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి బియ్యంగా అందించలేదు. ధాన్యం తీసుకున్నది వాస్తవమేనని సివిల్ సప్లై అధికారులు ధ్రువీకరించారు.
News November 23, 2025
రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు (సోమవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం దారుక బంజారాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.
News November 23, 2025
డీసీసీ దక్కకపోవడంపై మోహన్ రెడ్డి అసంతృప్తి

నల్లగొండ జిల్లా డీసీసీ దక్కకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయన్నారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావని వాపోయారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నిబద్ధతతో పని చేశానన్నారు.


