News March 3, 2025

13,400 మంది విద్యార్థులకు.. ఉ.9 నుంచి పరీక్ష

image

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. నంద్యాల జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 13,400 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students

Similar News

News April 14, 2026

విశాఖ జూలో సింహం మృతి

image

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.

News April 14, 2026

సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల నేతలు భేటీ

image

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ తదితరులు హాజరయ్యారు. పెద్ద నాయకులు పార్టీ వీడినా తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.

News April 14, 2026

బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు..19,292 మంది స్టూడెంట్స్ ఎదురుచూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. జిల్లాలో మొత్తం 19,292 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం 9,744 మంది, రెండో సంవత్సరం 9,548 మంది ఉన్నారు. 36 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు రేపు ఉదయం 10:31 కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.