News September 16, 2024

షేక్ హసీనాపై 136 హత్యా కేసులు నమోదు

image

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. తాజాగా ఓ విద్యార్థి హత్యకు సంబంధించి ఆమెపై కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ ఆమెపై 155 కేసులు నమోదవగా, అందులో 136 హత్యా కేసులే. ఇటు హసీనా GOVTకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 1000 మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Similar News

News October 17, 2025

తిన్న వెంటనే నడుస్తున్నారా?

image

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it

News October 17, 2025

మంత్రి లోకేశ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

image

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై Xలో TDP, YCP సెటైరికల్ పోస్టులు పెడుతున్నాయి. ‘గూగుల్‌ను సమర్థించలేక, ఎలా విమర్శించాలో అర్థంకాక YCP గుడ్డు బ్యాచ్ గుడ్డు మీద ఈకలు పీకుతోంది’ అంటూ TDP అమర్నాథ్ ఫొటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీనిపై YCP స్పందిస్తూ ‘పరిశ్రమల ఏర్పాటుపై అమర్నాథ్ గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి లోకేశ్’ అని పేర్కొంది.

News October 17, 2025

పిల్లలను స్కూల్‌కు పంపేందుకు ఇంత కష్టపడుతున్నారా?

image

పిల్లలను తయారుచేసి బడికి పంపే సమయంలో మనం చేసే హడావిడి.. మారథాన్‌లో పరిగెత్తడానికి సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు 3,000 క్యాలరీల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. పిల్లలను బట్టలు వేసుకోమని బతిమాలడం, అరవడంలో తల్లిదండ్రులు ఖర్చుచేసే శక్తి ‘మారథాన్‌లో పరుగెత్తడం, కోపంగా ఉన్న ఎలుగుబంటితో పోరాడినంత పనే’ అని ప్రొఫెసర్ ఓలాన్ విచ్ వివరించారు. మీరూ ఇలా కష్టపడతారా?