News April 27, 2024

1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టులు, ఇతర వివరాల కోసం https://nvs.ntaonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Similar News

News November 22, 2025

గ్రీన్‌ ఫీల్డ్ హైవే పరిహారంలో జాప్యం.. రైతుల్లో ఆందోళన

image

వరంగల్ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పూర్తిగా అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సంగెం మండలం చింతలపల్లి, సంగెం, తిమ్మాపూర్, తీగరాజుపల్లిలో కలిపి వందల ఎకరాలు ప్రాజెక్ట్‌కు వెళ్లగా, మొత్తం 308 మందిలో 230 మందికే డబ్బులు జమయ్యాయి. నెక్కొండలో 440 మందిలో 386 మందికి, గీసుగొండలో ఆరుగురు, పర్వతగిరిలో ఐదుగురు కోర్టుకు వెళ్లడంతో వారి పరిహారం పెండింగ్‌లో ఉంది.

News November 22, 2025

‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

image

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్‌వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్‌) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News November 22, 2025

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

image

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.