News December 15, 2025
‘1378 పాఠశాలల్లో నైపుణ్య విద్య’

ఆంధ్రప్రదేశ్‌లోని 1378 పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం నైపుణ్య విద్యను అమలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. సోమవారం పార్లమెంటులో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా సమగ్ర శిక్ష పథకం ద్వారా దశలవారీగా అన్ని పాఠశాలల్లో దీనిని విస్తరిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
బాపట్ల: కోడి గుడ్డు ధరకు రెక్కలు..!

తక్కువ ధరకు లభించే పౌష్టికాహారమైన కోడిగుడ్ల ధర ఆకాశాన్నంటింది. మేదరమెట్లలో కోడిగుడ్ల ధరలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో గుడ్డు ధర రూ.7.30 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.8కి విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్డు ఏకంగా రూ.15 పలుకుతోంది. దాణా, నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైతులు ఫారాలను మూసివేస్తుండటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.
News December 22, 2025
‘SHANTI’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

సస్టైనబుల్ హార్నెస్సింగ్ & అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో సివిల్ న్యూక్లియర్ సెక్టార్‌లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్-1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్-2010ను కేంద్రం రద్దు చేసింది.
News December 22, 2025
ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో TG అధ్యాపకుడికి గోల్డ్ మెడల్

బెంగుళూరులో జరిగిన 76వ ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణకు గోల్డ్ మెడల్ లభించింది. ఓయూ పూర్వ విద్యార్థి అయిన రామకృష్ణ ప్రస్తుతం కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండోజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీని డిజిటల్ ఎకానమీలో సమీకరించడంపై సమర్పించిన పరిశోధనా పత్రం ఉత్తమంగా ఎంపికైంది.


