News December 1, 2025
1383 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

దేశవ్యాప్తంగా ఉన్న AIIMS హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్, BE, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-4(CRE-4)2025 ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్. https://aiimsexams.ac.in/
Similar News
News December 1, 2025
సమంత-రాజ్ వివాహ ప్రక్రియ గురించి తెలుసా?

<<18437680>>సమంత-రాజ్<<>> ఈషా కేంద్రంలో ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచే పవిత్ర ప్రక్రియే ఇది. లింగ భైరవి లేదా ఎంపిక చేసిన ఆలయాల్లో ఈ తరహా క్రతువులు నిర్వహిస్తారు. దీంతో దంపతుల మధ్య సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెంపొందుతుందని విశ్వసిస్తారు. సద్గురు చేతుల మీదుగా ఈ లింగ భైరవి దేవి ప్రాణప్రతిష్ఠ జరిగింది.
News December 1, 2025
లేటు వయసులో ప్రేమే స్ట్రాంగ్

35 ఏళ్ల తర్వాత జీవితంలోకి వచ్చే ప్రేమ, పెళ్లిలో బ్రేకప్‌లు, విడాకులు ఉండవని మహిళలు నమ్ముతున్నారని ‘సైకాలజీ టుడే’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొంది. టీనేజ్ ప్రేమ, పెళ్లిళ్లలో ఆశలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి సరిగా లేకపోయినా మార్చుకోవచ్చని భావిస్తారు. కానీ 35 తర్వాత ఒక వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తులో మారే అవకాశ తక్కువ. అలాగే ఆ వయసులో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తెలిపారు.
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్‌లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://www.ibps.in/


