News January 4, 2025
1,383 ఎకరాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్..!
రాష్ట్రంలోని కొత్త విమనాశ్రాయాల నిర్మాణాలపై శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం ఆయన నివాసంలో సమీక్షించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఫీజిబిలిటి సర్వే పూర్తయిందని సీఎం కీలక ప్రకటన చేశారు. నిర్మాణానికి దాదాపు 1,383 ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉందన్నారు.
Similar News
News January 8, 2025
SKLM: ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News January 7, 2025

శ్రీకాకుళం జిల్లాలో యువ ఓటర్లు 15,037 మంది నమోదు
శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల జాబితా సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్వరరావు విడుదల చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న ఓటర్లు 15,037 మంది ఉన్నట్లు ప్రకటించారు. దీనిలో నరసన్నపేటలో 2,347 మంది, ఎచ్చెర్ల లో 2884, ఆమదాలవలసలో 2105, శ్రీకాకుళం 2,661, పాతపట్నం 1,952, టెక్కలి 2,606, పలాస 2,301, ఇచ్చాపురంలో 2,459 మంది యువ ఓటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.