News November 5, 2024
14న అనంత జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి మోటార్ వాహనాల ప్రమాద కేసులు, సివిల్, చెక్‌బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారని తెలిపారు.
Similar News
News November 27, 2025
అనంత: పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

అనంతపురంలో 2 ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, LPT (తెలుగు, హిందీ), పీఈటీ పోస్టులు ఉన్నాయన్నారు. RCM ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 SGT పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించామన్నారు.
News November 27, 2025
అనంత: పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు

అనంతపురంలో 2 ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, LPT (తెలుగు, హిందీ), పీఈటీ పోస్టులు ఉన్నాయన్నారు. RCM ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 SGT పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించామన్నారు.
News November 26, 2025
అనంతపురం: ఆనంద్‌ది పరువు హత్య..?

ప్రేమ పేరుతో రప్పించి యనకళ్లు గ్రామానికి చెందిన వాల్మీకి బోయ ఆనంద్‌ను బ్రహ్మాసముద్రం మండలంలో హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం ఏపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు అక్కులప్ప, మాధవయ్య తదితరులు ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐ హరినాథ్‌కు వినతి పత్రం అందించారు.


