News February 12, 2025
14న కడపకు మాజీ సీఎం జగన్ రాక

ఈనెల 14న కడప నగరానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహానికి జగన్ హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి కడపకు చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం జగన్ నేరుగా బెంగళూరుకు వెళ్తారని పార్టీ నాయకులు వెల్లడించారు.
Similar News
News December 2, 2025
ప్రొద్దుటూరు: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు: స్థానిక గాంధీరోడ్డులో సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి చెందాడు. అంబులెన్స్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ఔట్ పోస్ట్ పోలీస్ షబ్బీర్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశారు. అతని వద్ద లభించిన రైస్ కార్డ్లోని వివరాల మేరకు షేక్ గౌస్ మొహిద్దీన్గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
News December 2, 2025
కడప: జిల్లాలో రూ.83.38 కోట్ల మద్యం విక్రయం

కడప జిల్లాలో నవంబరు నెలలో రూ.83.38 కోట్ల మద్యాన్ని విక్రయించారు. 44,233 కేసులు బీర్లు, 1,24,430 కేసులు మద్యం విక్రయించారు. కడపలో రూ.22.85 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.15.61 కోట్లు, మైదుకూరులో రూ.7.74 కోట్లు, సిద్దవటంలో రూ.2.43 కోట్లు, పులివెందులలో రూ.9.73 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.6.62 కోట్లు, ముద్దనూరులో రూ.3.52 కోట్లు, జమ్మలమడుగులో రూ.5.74 కోట్లు, బద్వేల్లో రూ.9.10 కోట్లు మద్యాన్ని విక్రయించారు.
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.


