News July 9, 2025

14న భూపాలపల్లిలో అప్రెంటిస్‌షిప్ మేళా

image

ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా(PMNAM)ను ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

Similar News

News July 10, 2025

మంచిర్యాల జిల్లా అధికారులతో DPO సమావేశం

image

జిల్లా పంచాయతీ అధికారి D.వెంకటేశ్వరరావు అధ్యక్షతన డివిజన్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్, గృహ నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్లాంటేషన్, గ్రామపంచాయతీల తనిఖీలు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, DSR గురించి సమీక్షించారు.

News July 10, 2025

కల్తీ కల్లు ఘటనలో బాధితుల వివరాలు

image

బాలానగర్ ఎక్సైజ్ PS పరిధిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌తో పాటు రాందేవ్‌రావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను విడుదల చేశారు. నిమ్స్‌లో 27 మంది చికిత్స పొందుతుండగా కూకట్‌పల్లిలోని రాందేవ్‌దేవ్‌రావు ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

News July 10, 2025

జగిత్యాల జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

image

జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చీటీ శ్రీనివాసరావు విజయం సాధించారు. పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో తన సమీప అభ్యర్థి బండ స్వామిపై 73 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ రావు విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా సంపూర్ణ చారి, ట్రెజరర్‌గా సిరిసిల్ల వేణుగోపాల్ ఎన్నికయ్యారు.