News October 9, 2024

14 నుంచి పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు: కలెక్టర్

image

పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలను జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 14 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, రూ.15.35కోట్లతో 176 పనులకు పరిపాలన మంజూరుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 160 సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

Similar News

News October 14, 2025

యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

image

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

News October 14, 2025

తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

image

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.

News October 14, 2025

GNT: సైబర్ నేరాలకు పాల్పడుతున్న వంటమాస్టర్ అరెస్ట్ !

image

గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన రైస్ మిల్లు యజమాని వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. కోటి కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లుకు చెందిన నిందితుడు ఇంటర్ చదివి బెంగుళూరులో వంటమాస్టర్‌గా పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అలా కొల్లగొట్టిన డబ్బును అతని స్నేహితులు ఖాతాలకు మళ్లించడంతో పాటూ క్రికెట్ బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.