News November 5, 2025
’14 వరకు పశువులకు టీకా కార్యక్రమం పూర్తి చేయాలి’

సూర్యాపేట జిల్లాలో ఉన్న 2.69 లక్షల పశువులకు ఈనెల 14వ తేదీలోపు టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పశువైద్య శాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ కే. అనిల్ కుమార్ ఆదేశించారు. బుధవారం కోదాడ ప్రభుత్వ ప్రాంతీయ పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కోదాడలో ఇప్పటికే 3,300 పశువులకు టీకాలు వేయడం అభినందనీయమన్నారు.
Similar News
News November 5, 2025
బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
VZM: దివ్యాంగులకు సబ్సిడీతో రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలు

దివ్యాంగులకు 100% సబ్సిడీతో ప్రభుత్వం రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలను మంజూరు చేయనుందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు ఆశయ్య బుధవారం తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 70% లోయర్ లింబ్ దివ్యాంగత కలిగి ఉండాలని, వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.


