News March 17, 2024

పశ్చిమగోదావరిలో 14.61 లక్షల ఓటర్లు

image

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,61,338 మంది ఓట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలు అత్యధికంగా 7,44,308, పురుషులు 7,16,956 మంది, థర్డ్‌ జెండర్స్‌ 74 మంది ఉన్నారు. మొత్తంగా 1,463 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News April 5, 2026

భీమవరం కలెక్టరేట్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల రహిత సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మడ అడవులు ఉన్న దర్భరేవు, బియ్యపుతిప్ప, వేములదీవి ప్రాంతాల్లో కొత్త ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.