News July 22, 2024

ఐటీలో 14 గంటల పని: పురందీశ్వరి ఆగ్రహం

image

ఐటీ ఉద్యోగులకు <<13673562>>రోజుకు 14 గంటల పనిదినాల ప్రతిపాదనల్ని<<>> కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి మండిపడ్డారు. ఇలాంటి విధానాలు అమానుషమని అభిప్రాయపడ్డారు. ‘దీన్ని అమలు చేయడమంటే ఉద్యోగుల ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టడమే. ఈ విధానం వలన రెండు షిఫ్టులే ఉంటాయి. మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News December 4, 2025

ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

image

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్‌కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.

News December 4, 2025

భారత్‌ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్‌తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్‌లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్‌‌కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

News December 4, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

image

TG: పంచాయతీ ఎన్నికలకు SEC భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పలు జిల్లాల్లో పోలీసు బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. షాద్‌నగర్ పరిధిలోని పలు పంచాయతీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.