News July 27, 2024

శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం

image

AP: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,980 మంది దర్శించుకోగా 27,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.21 కోట్ల ఆదాయం సమకూరింది.

Similar News

News November 16, 2025

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

కోల్‌కతాలో టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 55* పరుగులతో రాణించారు. జడేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2, బుమ్రా, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టులో భారత్ గెలవాలంటే 124 రన్స్ చేయాలి.

News November 16, 2025

WOW.. చీమ కాలుపైనున్న వెంట్రుకలను కూడా గుర్తించే లెన్స్!

image

జార్జియా టెక్ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే PHySL అనే విప్లవాత్మక సాఫ్ట్ రోబోటిక్ లెన్స్‌ను సృష్టించారు. చీమ కాలుపై వెంట్రుకలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు. 4 మైక్రోమీటర్ల వెడల్పున్న అతి చిన్న వస్తువులను సైతం దీంతో స్పష్టంగా చూడొచ్చంటున్నారు. సర్జికల్ రోబోట్‌లు, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాలలో ఈ సాంకేతికత అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.

News November 16, 2025

పొద్దుతిరుగుడు విత్తనాలను ఇలా నాటితే మేలు

image

పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు బోదెలు చేసి విత్తనం నాటినట్లైతే నీటితడులు ఇవ్వడానికి, ఎరువులను వేయుటకు అనుకూలంగా ఉండటమే కాకుండా మొక్కకు పటుత్వం కూడా లభిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నిర్ణయించాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20-25 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. బరువైన నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ. మరియు మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో విత్తాలి.