News February 20, 2025
శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,745 మంది భక్తులు దర్శించుకోగా 24,156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు సమకూరింది.
Similar News
News November 10, 2025
స్పోర్ట్స్ రౌండప్

➣ ఈ నెల 27న ఢిల్లీలో WPL మెగా వేలం
➣ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ స్టాండింగ్స్: మూడో స్థానంలో IND, తొలి రెండు స్థానాల్లో AUS, SL
➣ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఫరూక్ అహ్మద్‌కు గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
➣ రంజీ ట్రోఫీ: తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ విజయం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రషీద్ (87), సెకండ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) హాఫ్ సెంచరీలు
News November 10, 2025
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News November 10, 2025
తెలంగాణ న్యూస్

✦ దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందన్న CM రేవంత్.. రేపు మౌలానా జయంతి సందర్భంగా స్మరించుకున్న CM
✦ 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
✦ ఈనెల 17, 18 తేదీల్లో HYD సమీపంలోని తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. <


