News July 21, 2024

కర్ణాటకలో ఐటీ ఉద్యోగులకు 14గంటల పని?

image

తమ ఉద్యోగులకు పని గంటల్ని పెంచాలన్న ఐటీ సంస్థల ప్రతిపాదనల్ని కర్ణాటక సర్కారు పరిశీలిస్తోంది. దీని కోసం చట్టంలో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు గరిష్ఠంగా 10 గంటలు పనిచేస్తున్నారు. ఈ ప్రతిపాదన చట్టమైతే 14 గంటలు పని చేయించేందుకు సంస్థలకు అనుమతి లభిస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌‌ను కలిసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.

Similar News

News December 4, 2025

పుతిన్ భారత పర్యటన షెడ్యూల్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సాయంత్రం 6.35 గం.కు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11AMకు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30AMకు మహాత్మాగాంధీ సమాధి (రాజ్‌ఘాట్) వద్ద నివాళి అర్పిస్తారు. 11.50AMకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. 1.50PMకు మీడియా సమావేశం ఉంటుంది. 3.40PMకు బిజినెస్ ఈవెంట్, 7PMకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశంలో పాల్గొంటారు.

News December 4, 2025

తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

image

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.

News December 4, 2025

పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

image

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.