News April 3, 2024

మామిడి దిగుబడిలో 14% వృద్ధి ఉండొచ్చు: ICAR-CISH

image

వేసవి వచ్చిదంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. అయితే ఈసారి ఈ సందడి ఇంకాస్త ఎక్కువ ఉండనుందట. పంట దిగుబడి పెరగడమే ఇందుకు కారణం. గత ఏడాదితో పోలిస్తే 14శాతం వృద్ధి నమోదై ఈసారి పంట దిగుబడి 24 మిలియన్ టన్నులకు చేరొచ్చని ICAR-CISH వెల్లడించింది. ఈసారి 10-20 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు ఉండొచ్చన్న IMD హెచ్చరికపై స్పందిస్తూ.. అది పంట దిగుబడిపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చని పేర్కొంది.

Similar News

News January 30, 2026

‘ధురంధర్’ OTT.. నెట్‌ఫ్లిక్స్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

image

నెట్‌ఫ్లిక్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ధురంధర్’ మూవీ ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో దాదాపు 10 నిమిషాల సీన్లు తొలగించడంతో పాటు చాలా డైలాగ్స్ మ్యూట్ చేయడంపై మండిపడుతున్నారు. ‘A’ సర్టిఫికెట్ ఉన్న సినిమాను OTTలో కట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యానిమల్‌, కబీర్‌ సింగ్‌కు లేని కండీషన్లు దీనికే ఎందుకని Netflixను నిలదీస్తున్నారు.

News January 30, 2026

ఉగాదికి జాబ్ క్యాలెండర్!

image

AP: ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా ఖాళీలను సేకరిస్తున్నట్లు సమాచారం. పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖపై పడే భారం బేరీజు వేసుకొని ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపాయి.

News January 30, 2026

దానంపై అనర్హత పిటిషన్లు.. విచారణ ప్రారంభం

image

TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ కౌశిక్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై స్పీకర్ విచారణ ప్రారంభించారు. ఇదే విషయంపై మహేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను ఇవాళ 12pmకు విచారిస్తారు. విచారణ నిమిత్తం అసెంబ్లీకి దానం చేరుకున్నారు. అంతకుముందు అడ్వకేట్లతో చర్చించారు. కౌశిక్‌, మహేశ్వర్‌ను నాగేందర్‌ లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. తాను BRSలోనే ఉన్నానని దానం ఇప్పటికే కౌంటర్ వేశారు.