News September 8, 2024

14న జమ్మూలో ప్రధాని ఎన్నికల ప్రచారం

image

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న జమ్మూలో ప్రధాని మోదీ ప్రచారం ఆరంభించనున్నారు. ఆ రోజు పలు సభల్లో ఆయన పాల్గొంటారు. దీంతో మోదీ ఏ అంశాలను ప్రస్తావిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కాగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో(ఈ నెల 18, 25, అక్టోబర్ 1) పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

image

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.

News November 20, 2025

ఫోన్‌పే టాప్!

image

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.

News November 20, 2025

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

image

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.