News May 3, 2024
14 సెగ్మెంట్లు సమస్యాత్మకం.. అక్కడ 100% వెబ్‌కాస్టింగ్

AP: రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలు సమస్యాత్మకమైనవిగా సీఈవో ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. వాటిలో పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల, ఒంగోలు, ఆళ్లగడ్డ, చంద్రగిరి, తిరుపతి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి ఉన్నాయని చెప్పారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌తో భారీగా CAPF బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 23, 2025
అతిగా స్క్రీన్ చూస్తే ఆలస్యంగా మాటలు!

పిల్లలను అతిగా స్క్రీన్(TV, ఫోన్) చూసేందుకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు ప్రమాదమని అంతర్జాతీయ సర్వే హెచ్చరిస్తోంది. చిన్నవయసులో(1-5 ఏళ్లు) ఎక్కువగా స్క్రీన్ చూసే పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అటు కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, తప్పనిసరైతే నాలెడ్జ్ పెంచే వీడియోలను సూచించాలని చెబుతోంది.
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.


