News June 27, 2024
140 కేజీల నల్ల రాతి గుండు బలప్రదర్శన పోటీలు

పెద్దకడబూరు మండలం మేకడోణలో ఏరువాక ఎద్దుల పండుగ సందర్భంగా 140 కేజీల నల్ల రాతి గుండు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వైసీపీ కో ఆప్షన్ మెంబర్ రెడ్డి షేర్ ఖాన్ పటేల్ గెలుపొందారు. పోటీలను చూడటానికి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలతో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.
Similar News
News February 14, 2025
కర్నూలు జిల్లాకు చెందిన DSP మృతి

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 14, 2025
కర్నూలులో బర్డ్ ఫ్లూ తొలి కేసు.. రెడ్ జోన్‌గా ప్రకటన

కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్‌లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
News February 13, 2025
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఈనెల 15 నుంచి 28వ తేదీ కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు నర్సాపురం సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రసూల్ ఖాన్, కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ మహేశ్ ఎంపికయ్యారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసులు, కల్లూరు ఏవీహెచ్ అడిషనల్ డైరెక్టర్ పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.