News November 19, 2024
ఒకే కుటుంబంలో 140 మంది డాక్టర్లు
ఢిల్లీకి చెందిన ఓ కుటుంబంలో ఇప్పటివరకు 140 మంది డాక్టర్లుగా పనిచేశారు. 1920లో సభర్వాల్ ఫ్యామిలీలో తొలిసారిగా బోధిరాజ్ వైద్య వృత్తి స్వీకరించారు. ఆ తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వైద్య విద్య అభ్యసించారు. మెడిసిన్ చదివిన అమ్మాయినే ఆ కుటుంబంలోని వారు పెళ్లి చేసుకుంటున్నారు. ఒక కోడలు బయోకెమిస్ట్ చదవగా అమెతో మళ్లీ మెడిసిన్ చదివించారు. ప్రస్తుతం వీరికి ఢిల్లీలో 5 ఆస్పత్రులు ఉన్నాయి.
Similar News
News November 30, 2024
రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు: కిషన్ రెడ్డి
TG: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్ఏఎస్సీఐ స్కీమ్తో రెండింటిని డెవలప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
News November 30, 2024
కోహ్లీ.. ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?
BGT రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఈ గ్రౌండ్లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికలో కోహ్లీ సగటు 60కి పైనే ఉంది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది.
News November 30, 2024
పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా
దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.