News June 28, 2024

ఈజిప్టులో వెలుగుచూసిన 1400 మమ్మీలు!

image

సుమారు 1400 మమ్మీలున్న 36 సమాధుల్ని పరిశోధకులు ఈజిప్టులో తాజాగా గుర్తించారు. ఇవి లభ్యమైన ప్రాంతాన్ని ‘అస్వాన్’గా పిలుస్తున్నారు. నైలు నదికి తూర్పు తీరంలో 2.70 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం కనీసం 4500 ఏళ్ల క్రితం నాటిదని, అంటురోగాలు సోకిన వారిని ఇలా సామూహికంగా ఖననం చేసి ఉంటారని భావిస్తున్నారు. వీటిని గుర్తించేందుకు ఐదేళ్ల పాటు శ్రమించినట్లు ఆర్కియాలజిస్టులు తెలిపారు.

Similar News

News September 20, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్‌లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT

News September 20, 2024

మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు

image

AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

News September 20, 2024

కొత్త రేషన్ కార్డులపై రేపే తుది నిర్ణయం!

image

TG: కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై తుదినిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.