News February 18, 2025

1,427 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించాం: జగదీశ్వర్

image

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్కూల్ ఐస్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ములుగు ఆరోగ్యశాఖ కార్యాలయంలో విద్యార్థులకు ఐస్క్రీనింగ్ నిర్వహించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న విద్యార్థులను గుర్తించేందుకు రోజుకు 100 మందికి స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు వివిధ పాఠశాలలకు చెందిన 1,427 మంది పిల్లలకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Similar News

News April 20, 2026

ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

image

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.

News April 20, 2026

ఇరాన్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నాం: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్లేందుకు యత్నించిన ఇరాన్ నౌక ‘టౌస్కా’ను స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వార్నింగ్స్ ఇచ్చినా వినకపోవడంతో తమ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పారు. తమ USS Spruance డెస్ట్రాయర్ ద్వారా ఇరాన్ షిప్‌ ఇంజిన్‌రూమ్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ స్వాధీనంలో ఉన్న ఆ నౌకలో ఏముందో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.