News February 17, 2025

1,427 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించాం: జగదీశ్వర్

image

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్కూల్ ఐస్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ములుగు ఆరోగ్యశాఖ కార్యాలయంలో విద్యార్థులకు ఐస్క్రీనింగ్ నిర్వహించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న విద్యార్థులను గుర్తించేందుకు రోజుకు 100 మందికి స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు వివిధ పాఠశాలలకు చెందిన 1,427 మంది పిల్లలకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Similar News

News November 7, 2025

వరంగల్: అమ్మ, నాన్నకు ప్రేమతో..!

image

పిల్లలు పుట్టగానే కాదు వాళ్లు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అని ఒక కవి అన్నారు. ఆమె పుట్టి ప్రయోజకురాలు అవడమే కాకుండా తల్లిదండ్రుల చిరకాల స్వప్నమైన సొంతింటిని గిఫ్ట్‌గా ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పర్వతగిరి(M) కల్లెడకు చెందిన జీవంజి దీప్తి పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి తల్లిదండ్రుల పేరును నిలబెట్టింది. అంతేకాదు, సొంతింటిని హనుమకొండలో కొని ఇచ్చింది.

News November 7, 2025

VKB: మూసీ జన్మస్థలం.. ఔషధ జలధార!

image

అనంతగిరి అడవి ఔషధ గుణాల నిలయంగా విరాజిల్లుతుంది. అనంతగిరి అడవిలో పెరిగే వేలాది మొక్కల వేర్ల నుంచి వడపోతకు గురయ్యే స్వచ్ఛమైన జలమే మూసీ నదికి ఆధారం. నిజాం కాలంలో టీబీ రోగుల చికిత్సకు ఈ కొండల్లో ఆసుపత్రిని నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇదే. పువ్వుల పుప్పొడి, పచ్చని చెట్ల ఫైటో న్యూట్రియంట్స్‌తో కూడిన స్వచ్ఛమైన గాలి, ఔషధ జలధార ఆరోగ్యానికి సంజీవనిగా పనిచేస్తాయని నాటి వైద్యులు నమ్మేవారు.

News November 7, 2025

ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.