News February 17, 2025
1,427 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించాం: జగదీశ్వర్

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్కూల్ ఐస్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ములుగు ఆరోగ్యశాఖ కార్యాలయంలో విద్యార్థులకు ఐస్క్రీనింగ్ నిర్వహించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న విద్యార్థులను గుర్తించేందుకు రోజుకు 100 మందికి స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు వివిధ పాఠశాలలకు చెందిన 1,427 మంది పిల్లలకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
Similar News
News December 22, 2025
GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.
News December 22, 2025
అమీర్‌పేట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

HYD అమీర్‌పేట్ అంటే కోచింగ్ సెంటర్ల అడ్డా మాత్రమే కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆశల వారధి. 1900 కాలంలో ఆరో నిజాం తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి వేసవి రాజభవనమే నేటి నేచర్ క్యూర్ ఆసుపత్రి. రాజసం నిండిన ఈ గడ్డపై ఎందరో విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ప్రపంచస్థాయి కంపెనీలలో స్థిరపడ్డారు. ప్రతి విద్యార్థికి అమీర్‌పేట్ ఓ భావోద్వేగం. ఎంత ఎదిగినా ఈ చోటును ఎవరూ మర్చిపోలేరు.
News December 22, 2025
అనంతపురం: కరెంటోళ్ల జనబాట పోస్టర్ ఆవిష్కరణ

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో AP SPDCL కరెంట్ టోళ్ల జన బాట పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో కరెంట్ టోళ్ల జన బాట పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


