News January 29, 2025

144 సెక్షన్ అమలు చేయాలి: అల్లూరి జేసీ 

image

మార్చి 1నుంచి 15వతేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నందున, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను బుధవారం ఆదేశించారు. పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జిరాక్స్ షాపులు మూసివేయించాలన్నారు.

Similar News

News February 8, 2025

BREAKING: నిజామాబాద్‌: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.

News February 8, 2025

ములుగు: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో ములుగు జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

News February 8, 2025

హనుమకొండ: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో హనుమకొండ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

error: Content is protected !!