News March 17, 2024
ములుగు జిల్లాలో 144 సెక్షన్- ఎస్పీ
ములుగు జిల్లాలో రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ షాపులను సైతం మూసివేయాలని కోరారు. కాగా జిల్లాలో 3,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News October 31, 2024
WGL: చారిత్రాత్మక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు: కలెక్టర్
జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నేడు వరంగల్ కలెక్టర్ సత్య శారదా సమీక్షించి సమర్థ నిర్వహణకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టూరిజం క్లబ్స్లో సభ్యత్వం పొందిన విద్యార్థులతో పాటు 2వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో చారిత్రిక, పర్యాటక ప్రాంతాలను తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
News October 30, 2024
WGL: నర్సంపేట మార్కెట్కు 4రోజులు సెలవులు
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరసగా 4 రోజులు సెలవులు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 31(గురువారం) దీపావళి, 1(శుక్రవారం) అమావాస్య, 2(శనివారం), 3(ఆదివారం) తేదీల్లో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు సెలవులు ప్రకటించారు. తిరిగి 4న మార్కెట్ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.
News October 30, 2024
వరంగల్ మార్కెట్లో తగ్గిన చిరుధాన్యాల ధరలు
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారంతో పోలిస్తే ఈరోజు సూక పల్లికాయ ధర స్వల్పంగా పెరిగింది. నిన్న రూ.4,600 పలికిన సూక పల్లికాయ నేడు రూ.4,610 ధర పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేలు ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టీ క్వింటాకి మంగళవారం రూ.2,550 ధర రాగా నేడు రూ.2,530కి పడిపోయిందని అధికారులు తెలిపారు.