News March 17, 2025

144 సెక్షన్ అమల్లో ఉంటుంది: బాపట్ల ఎస్పీ

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్‌కు అనుమతి లేదని అన్నారు. మాస్ కాపీయింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 17, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2025

తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

image

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.

News March 17, 2025

ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

image

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.

error: Content is protected !!