News March 21, 2025

14400కు కాల్ చేయండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో సారా నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో నవోదయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సారా తయారీ చేసినా, విక్రయించినట్లు తెలిసినా ప్రజలు 14400 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ మణికంఠ, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 28, 2025

ఆర్మీలో ఉద్యోగావకాశాలు: చిత్తూరు కలెక్టర్

image

ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.

News March 28, 2025

చిత్తూరు: ఖాళీ స్థానాలకు ఎన్నికలు

image

చిత్తూరు జిల్లాలో మండల పరిషత్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

News March 27, 2025

error: Content is protected !!