News March 13, 2025
14405 టోల్ ఫ్రీపై విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

నాటు సారా సంబంధిత ఫిర్యాదులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 14405కు విస్తృత ప్రచారం కల్పించి సారారహిత జిల్లాగా పార్వతీపురం మన్యంకు గుర్తింపు తీసుకురావాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. గురువారం ఇందుకు సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. పోలీసులు నాటు సారా గ్రామాలను దత్తత తీసుకోవాలని అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంగా విస్తృత దాడులు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 14, 2025
VIRAL: కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ చూశారా?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరో 8 రోజుల్లో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, ఆయన నయా హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ షేర్ చేస్తూ ‘GOAT ఎనర్జీ’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 218 రన్స్ చేసిన కింగ్, ఈసారి తన బ్యాటింగ్‌తో ఆర్సీబీకి తొలి కప్ అందిస్తారేమో చూడాలి.
News March 14, 2025
ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతి

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మణికుమార్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా గుర్తించామన్నారు. కుటుంబ కలహాలతో వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కాలువలో దూకి మృతిచెందాడని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.