News November 23, 2024

BRS ఖాతాలో రూ.1,449 కోట్లు.. YCP అకౌంట్‌లో రూ.29 కోట్లు

image

తమ పార్టీ ఖాతాలో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నివేదిక ఇచ్చింది. దీంతో దేశంలోనే రిచ్చెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే పార్టీ ఖాతాలో ఇంత భారీ ఎత్తున నగదు లేదు. వైసీపీ ఖాతాలో రూ.29 కోట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీ-రూ.272 కోట్లు, డీఎంకే-రూ.338 కోట్లు, సమాజ్‌వాదీ-రూ.340 కోట్లు, జేడీయూ ఖాతాలో రూ.147 కోట్లు ఉన్నాయి.

Similar News

News December 4, 2025

జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పింది. అదే రోజు కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని వెల్లడించింది. కాల్ లెటర్లు రానివారు అధికారిక వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జులై 15-23 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

News December 4, 2025

డాలర్.. 12 లక్షల రియాల్స్‌!

image

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్‌ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్‌ గ్రిడ్‌ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్‌ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.

News December 4, 2025

‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

image

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.