News April 2, 2025
147శాతం బొగ్గు ఉత్పత్తి చేశాం: శ్రీరాంపూర్ జీఎం

2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషితో శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన 65.16 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి నెలలో ఏరియాలోని గనులు రికార్డు స్థాయిలో 147 శాతం ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. 28, 31 తేదీల్లో 10 రేకుల బొగ్గు రవాణా చేసినట్లు వెల్లడించారు.
Similar News
News April 21, 2025
పీజీఆర్ఎస్ సమస్యలకు పోలీసు శాఖ కృషి చేస్తుంది: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చూసేందుకే పోలీసు శాఖ కృషి చేస్తుందని ఎస్పీ ప్రతాప్ సింగ్ కిషోర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన పీజీఆర్ఎస్ ఫిర్యాదులను ఆయన ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్వీకరించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతిదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు.
News April 21, 2025
JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
News April 21, 2025
NLR: వాగులో మహిళ మృతదేహం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం మహిళ మృతదేహం కలకలం రేపింది. అనికేపల్లి సమీపంలోని కర్రోడ వాగులో మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వెంకటాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.