News February 26, 2025
149 హాట్ స్పాట్‌లపై గట్టి నిఘా: కలెక్టర్

మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన 149 హాట్‌స్పాట్‌లపై గట్టి నిఘా పెట్టాలని, ఈ విషయంలో ఈగల్ బృందాలు కీలకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.
Similar News
News March 20, 2025
మన ‘సంతోషం’ తక్కువేనట..

ప్రపంచ సంతోష సూచీలో వరుసగా 8వ సారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 147 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలు నేపాల్(92), PAK(109) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది(126)తో పోలిస్తే ఇండియా తన పొజిషన్‌ను కాస్త మెరుగుపరుచుకుంది. కాగా సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇస్తారు.
News March 20, 2025
భారత జట్టుకు భారీ నజరానా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ ప్రైజ్ మనీ(రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.
News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.