News February 26, 2025

149 హాట్‌ స్పాట్‌ల‌పై గ‌ట్టి నిఘా: కలెక్టర్

image

మాద‌క ద్ర‌వ్యాల వినియోగానికి సంబంధించిన 149 హాట్‌స్పాట్‌ల‌పై గ‌ట్టి నిఘా పెట్టాల‌ని, ఈ విష‌యంలో ఈగ‌ల్ బృందాలు కీల‌కంగా ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్ర‌త్యేక సమావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ‌త్తు ప‌దార్థాల వినియోగం వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని ఆయన కోరారు.

Similar News

News July 9, 2025

KNR: లోకల్ ఎన్నికలు.. ఆ పార్టీలు తగ్గేదేలే..!

image

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కాగా నిన్న కాంగ్రెస్ ఉమ్మడి KNR జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అద్దంకి దయాకర్‌ను అధిష్ఠానం నియమించగా పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ చేయనున్నారు. మరోవైపు KTR ఆదేశాలతో ఇప్పటికే BRS నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BJP సైతం గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది.

News July 9, 2025

మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

image

భారత్‌‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్‌ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్

News July 9, 2025

HYD: మెట్రో పార్కింగ్.. తప్పించుకోలేరు..!

image

HYD నగర మెట్రో స్టేషన్లు వద్ద వాహనాలు పార్కు చేసి, ఎవరు చూడని సమయంలో పార్కింగ్ ఫీజు కట్టకుండా బైకులు తీసుకెళ్లినవారు తప్పించుకోలేరని నిర్వాహకులు తెలిపారు. మీరు పార్కు చేసినప్పుడే డిజిటల్ రూపంలో అన్ని వివరాలు పొందు పరుస్తారు. పార్కింగ్ ఫీజు ఆన్ లైన్లో జెనరేట్ అవుతుంది. మరోసారి వచ్చినపుడు కనుక చెల్లిస్తే మీకు తెలియకుండానే గత పెండింగ్ పార్కింగ్ ఫీజు, ప్రస్తుతం ఫీజు కలిపి చెల్లించాల్సి వస్తుంది.